Home న్యూస్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కలెక్షన్స్: టార్గెట్ 4 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం ఆది!!

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కలెక్షన్స్: టార్గెట్ 4 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం ఆది!!

0

     సాయి కుమార్ తనయుడు ఆది కి ఈ మధ్య టైం అస్సలు కలిసి రావడం లేదు, కెరీర్ స్టార్టింగ్ లో యమ జోరు మీదున్న ఆది కి తర్వాత ఒకటి కి మించిన ఫ్లాఫ్స్ వరుసగా వస్తుండగా క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడుస్తుంది, ఇలాంటి టైం లో ఈ ఇయర్ లో ఇప్పటికే బుర్రకథ మరియు జోడి అంటు రెండు సినిమాలతో తన లక్ ని పరీక్షించు కున్నా కానీ….

ఆ రెండు సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశనే మిగిలించాయి. ఇలాంటి టైం లో వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు ఫేమ్ సాయి కిరణ్ అడివి డైరెక్షన్ లో చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో అయినా హిట్ కొట్టాలి అనుకున్నా ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకుంది.

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కేవలం 28 లక్షల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండు రోజు లు పూర్తీ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా సినిమా 46 లక్షల వరకు షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది, ఇక మూడో రోజు ఆదివారం అవ్వడం తో…

జోరు పెంచుతుంది అనుకున్నా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 14 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 16 లక్షల షేర్ ని మాత్రమె అందుకున్న సినిమా టోటల్ గా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 51 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 62 లక్షల షేర్ దాకా వసూల్ చేసింది.

కానీ సినిమాను టోటల్ గా 3.4 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్ గా అమ్మారు, 4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 3.38 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అది దాదాపు అసాధ్యమే అవ్వడం ఆది ఖాతాలో మరో డిసాస్టర్ మూవీ గా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా నిలిచి పోతుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here