Home న్యూస్ 11.5 కోట్లు రావాలి…3 రోజుల్లో రౌడీ బాయ్స్ కలెక్షన్స్ ఇవే!

11.5 కోట్లు రావాలి…3 రోజుల్లో రౌడీ బాయ్స్ కలెక్షన్స్ ఇవే!

0

పాపులర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్… బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఓపెనింగ్ డే నే మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా పోటి లో బంగార్రాజు సినిమా ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా జస్ట్ పర్వాలేదు అనిపించేలానే పెర్ఫార్మ్ చేసింది కానీ సినిమా బిజినెస్ వాల్యూ ఆల్ మోస్ట్…

11 కోట్ల రేంజ్ లో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండగా సినిమా 11.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 90 లక్షల షేర్ ని రెండో రోజు 1 కోటి దాకా షేర్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెప్పగా అందులో…..

రెండు తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో 35 లక్షల దాకా షేర్ ని సీడెడ్ లో 14 లక్షల దాకా షేర్ ని, ఆంధ్రలో 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…

ఏరియాల వారి లెక్కలను బయటికి చెప్పకూడదు అని చెప్పడంతో అన్ని ఏరియాల రిపోర్ట్ లు ఏవి రిలీజ్ కాలేదు. కానీ మొత్తం మీద మూడో రోజు సినిమా 90 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా మూడు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 2.7 కోట్ల మార్క్ ని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2.83 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… అందులో…

నైజాంలో కోటి దాకా షేర్, సీడెడ్ లో 45 లక్షల దాకా షేర్ టోటల్ ఆంధ్రలో 1.25 కోట్ల దాకా షేర్ ని అందుకుందని అంచనా వేస్తున్నారు… కానీ 11.5 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 8.67 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here