Home న్యూస్ 1st డే కన్నా 2nd డే ఎక్కువ…హీరో 2 డేస్ కలెక్షన్స్!!

1st డే కన్నా 2nd డే ఎక్కువ…హీరో 2 డేస్ కలెక్షన్స్!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో గా బాక్స్ ఆఫీస్ దగ్గర పరిచయం అయిన మొదటి సినిమా హీరో రీసెంట్ గా సంక్రాంతి రేసులో అన్ని సినిమాల తర్వాత చివరన రిలీజ్ ను సొంతం చేసుకోగా కామెడీ పరంగా ఆకట్టుకున్నా కానీ కథ పరంగా జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకునే ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ను…

సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ వివరాలను లాంటివి బయటికి చెప్పొద్దని చెప్పడంతో ఎక్కడా కూడా సినిమా సాధించిన షేర్ వివరాలు ఏవి కూడా అందుబాటులో లేవు. అలాగే సినిమా సాధించిన బిజినెస్ వివరాలు కూడా అందుబాటులో లేవనే చెప్పాలి…

కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఓన్ గానే సినిమాను థార్డ్ పార్టీ బయర్స్ తో రిలీజ్ చేశారని, బిజీస్ వర్త్ 6-7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం. క్లారిటీగా అన్ని డీటైల్స్ త్వరలో వచ్చాక మళ్ళీ అప్ డేట్ చేస్తాం. ఇక మొదటి రోజు సినిమా 65 లక్షల షేర్ ని…

తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల షేర్ ని అందుకోగా రెండో రోజు నైజాంలో 25 లక్షల దాకా షేర్, సీడెడ్ లో 11 లక్షల దాకా షేర్ ని ఆంధ్రలో 35 లక్షల దాకా షేర్ ని అందుకుందని అంచనా వేస్తుండగా రెండో రోజు మొత్తం మీద 72 లక్షల దాకా షేర్ ని అందుకుందని అంచనా వేస్తుండగా వరల్డ్ వైడ్ షేర్ 75 లక్షల దాకా ఉంటుందని అంచనా…

దాంతో 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.4 కోట్ల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here