కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి హాలిడేస్ ని ఎంజాయ్ చేసి ప్రతీ రోజూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు ఆదివారం అవ్వడంతో బాగా రెచ్చిపోయినా కానీ నైట్ షోల టైం కి…
కొన్ని చోట్ల వర్షాల ఇబ్బంది, బళ్ళారిలో నైట్ కర్ఫ్యూ, అలాగే సిటీలకు జనాల తిరుగు ప్రయాణాల వలన కలెక్షన్స్ కొంచం తగ్గాల్సి వచ్చింది. అయినా కానీ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీగానే హోల్డ్ చేసి మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో వర్త్ షేర్ ని…
సొంతం చేసుకుని దుమ్ము లేపింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు 6.72 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. 7 కోట్ల మార్క్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అనుకున్నా పైన చెప్పిన రీజన్స్ వలన ఆ మార్క్ ని అందుకోలేక పోయింది సినిమా..
ఇక టోటల్ గా మొదటి వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.52Cr
👉Ceeded: 4.68Cr
👉UA: 3.02Cr
👉East: 2.56Cr
👉West: 1.85Cr
👉Guntur: 2.36Cr
👉Krishna: 1.43Cr
👉Nellore: 1.15Cr
AP-TG Total:- 23.57CR(38Cr~ Gross)
👉Ka+ROI: 1.52Cr
👉OS – 1.20Cr
Total WW: 26.29CR(43.80CR~ Gross)
ఇదీ సినిమా మొదటి వీకెండ్ లో వరల్డ్ గా సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఫస్ట్ వీకెండ్ ని పూర్తీ చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 12.71 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.