Home న్యూస్ 2020 ట్విట్టర్ ఆల్ టైం రికార్డ్ కొట్టిన విజయ్ ఫ్యాన్స్!

2020 ట్విట్టర్ ఆల్ టైం రికార్డ్ కొట్టిన విజయ్ ఫ్యాన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఫాం తో దూసుకు పోతున్న కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ మరో పక్క సోషల్ మీడియా రికార్డుల విషయం లో కూడా అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు, విజయ్ నటించిన లేటెస్ట్ మూవీస్ టీసర్ లు ట్రైలర్ లు అన్నీ కూడా యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేసిన విషయం అందరి కీ తెలిసిందే, ఇదే సమయం లో

ట్విట్టర్ లో కూడా విజయ్… పేరిట అనేక రికార్డులు ఉన్నాయి… అత్యధిక సార్లు లైక్స్ విషయం లో కొత్త రికార్డులు సృష్టించిన హీరో గా విజయ్ పేరిట రికార్డులు ఉండగా ఇప్పుడు 2020 కి గాను ట్విట్టర్ మరో రికార్డ్ ను విజయ్ పేరిట వచ్చేలా చేసింది.

ఇండియా లో 2020 ఇయర్ కి గాను అత్యధిక రీట్వీట్స్ ని సొంతం చేసుకున్న ట్వీట్ గా… విజయ్ ట్వీట్ ని సెలెక్ట్ చేసింది. విజయ్ ఈ ఇయర్ మాస్టర్ సినిమా కి గాను నైవేలి లో షూట్ చేస్తుండగా భారీ సంఖ్య లో ఫ్యాన్స్ విజయ్ ని చూడటానికి….

విరగబడి రాగా ఆ టైం లో విజయ్ ఆ ఫ్యాన్స్ ని చూసి ఓ సేల్ఫీ తీసుకున్నాడు. ఆ సేల్ఫీ ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయగా ఆ ట్వీట్ కి అల్టిమేట్ రీ ట్వీట్స్ దక్కాయి.. ఏకంగా 1 లక్షా 45 వేలకి పైగా రీ ట్వీట్స్ ఆ ఒక్క ట్వీట్ కే రావడం తో ఇండియా లో 2020 ఇయర్ కి గాను అదే హైయెస్ట్ రీట్వీట్స్ ని సొంతం చేసుకున్న ట్వీట్ అవ్వడం తో అఫీషియల్ గా ట్విట్టర్ ఈ ఇయర్ కి గాను…

ఈ ట్వీట్ ని మోస్ట్ రీ ట్వీటెడ్ ట్వీట్ గా డిక్లేర్ చేసి రికార్డ్ ను విజయ్ పేరిట అలాగే విజయ్ ఫ్యాన్స్ పేరిట వచ్చేలా చేసింది. ఇక మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కే రావాల్సి ఉన్నా కరోనా వలన కుదరలేదు కానీ సంక్రాంతి బరిలో ఇప్పుడు ఈ సినిమా సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి అప్పుడు రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here