సడెన్ గా పరిస్థితులు మారిపోతున్నాయి… నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాలకు ఒకటికి మించి ఒకటి భారీ ఆఫర్స్ ఇచ్చిన OTT యాప్స్ ఇప్పుడు రేట్లు మార్చేస్తున్నాయి అన్నది టాలీవుడ్ ట్రేడ్ టాక్. ముందు ఎలా గైనా ఒక పెద్ద సినిమాను రిలీజ్ కి ఒప్పిస్తే చాలు తర్వాత అన్ని సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రేసు లోకి వస్తాయి అని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా….
భారీ రేట్లు ఆఫర్ చేసిన OTT యాప్స్ ఎట్టకేలకు నాని వి మూవీ రిలీజ్ అనౌన్స్ చేయడం తో ఇప్పుడు మిగిలిన సినిమాలు కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని రేసు లో ఎంటర్ అవ్వాలని చూస్తూ ఉండటం తో ముందు ఇచ్చిన ఆఫర్స్ కి నో చెబుతున్నాయని టాక్ ఉంది.
రీసెంట్ గా రెండు మూడు సినిమాల విషయం లో కూడా ఇలాంటి వార్తలే రాగా ఇప్పుడు మరో చిన్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కి కూడా ఇదే ఎదురు అయిందని అంటున్నారు. ఈ సినిమా ను సుమారు 4.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో ఓవరాల్ గా తెరకెక్కించారు.
సినిమాకి ఏప్రిల్ టైం లో 6.5 కోట్ల రేంజ్ ఆఫర్లు రాగా ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా అవ్వడంతో కొంతకాలం ఆగుదాం అనుకుని సినిమా డిజిటల్ రిలీజ్ కి నో చెప్పగా ఈ సినిమా ని లైట్ తీసుకుని వేరే సినిమాలను ట్రై చేశాయి OTT యాప్స్. ఇక నాని వి సినిమా నిర్ణయం తర్వాత ఈ సినిమా టీం కూడా…
OTT కే సై అని ముందు ఆఫర్ ఇచ్చిన వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇప్పుడు ఆ రేటు ఇచ్చుకోలేమని చెప్పారట. దాంతో ఈ సినిమా కి కూడా షాక్ తగిలినట్లు అయింది. ఇప్పుడు వేరే యాప్స్ లో బెటర్ ఆఫర్ ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా చేరింది అంటున్నారు మరి…