Home గాసిప్స్ రాక్షసుడు హిందీ రీమేక్….రేటు ఎంత పలికిందో తెలిస్తే షాక్!

రాక్షసుడు హిందీ రీమేక్….రేటు ఎంత పలికిందో తెలిస్తే షాక్!

0

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఫస్ట్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా రాక్షసుడు… 5 ఏళ్ల కెరీర్ లో ఏ సినిమా తో కూడా అందుకోలేని విజయాన్ని ఈ రీమేక్ సినిమా తో సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ కి ఈ సినిమా ముందు వరకు ఫ్లాఫ్ డైరెక్టర్ గా పేరున్నా కానీ ఈ సినిమాను…

బాగా హ్యాండిల్ చేసి ఒరిజినల్ వర్షన్ ని ఏమాత్రం చెడగొట్టకుండా మెప్పించేలా డైరెక్ట్ చేసి హిట్ డైరెక్టర్ గా మారగా ఇప్పుడు రవితేజ తో ఒక సినిమా తర్వాత రాక్షసుడు సినిమా కి సీక్వెల్ ఇలా ఫుల్ బిజీగా మారిపోగా ఇప్పుడు మరో ఆఫర్ కూడా అందుకున్నాడు.

తక్కువ టైం లో ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఈ సినిమా ను రీమేక్ చేసిన కారణంగా ఇప్పుడు త్వరలోనే హిందీ లో రీమేక్ కాబోతున్న ఈ సినిమా ను అక్కడ కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధం అయ్యాడు రమేష్ వర్మ. ఇక హిందీ లో రీమేక్ కాబోతున్న రాక్షసుడు సినిమా కి…

రీమేక్ రైట్స్ కింద ఏకంగా 2.7 కోట్ల రేటు దక్కిందని ట్రేడ్ లో టాక్ ఉంది. సౌత్ నుండి అక్కడ రీమేక్ అవుతున్న సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటు గా చెప్పుకోవచ్చు. హిందీ లో సినిమా అనుకున్నట్లు తెరకెక్కిస్తే కచ్చితంగా అక్కడ సినిమా రేంజ్ మరో లెవల్ కి చేరుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

ఇక రమేష్ వర్మ ఈ సినిమా ను ఇప్పుడే మొదలు పెట్టె అవకాశం లేదని తెలుస్తుంది… ముందు రవితేజ తో సినిమా చేసిన తర్వాత ఈ సినిమా రీమేక్ ని అలాగే రాక్షసుడు సినిమా సీక్వెల్ పనులను కూడా ముమ్మరం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక హిందీ లో ఎవరెవరు నటిస్తారు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here