ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా ఎఫెక్ట్ కొన్ని దేశాల వరకు మాత్రమె కాదు దాదాపు ప్రపంచ మంతా కొనసాగుతుంది, కొన్ని దేశాల్లో ఇయర్ మొదట్లో నుండే ఈ ప్రభావం ఉండగా కొన్ని దేశాల్లో రీసెంట్ గా స్టార్ట్ అయింది, దాంతో మూవీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె అన్ని దేశాల్లో కొత్త సినిమాల రిలీజ్ లు దాదాపు గా ఆగిపోయాయి. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లు అన్నీ కూడా…
దాదాపుగా రిలీజ్ లను పోస్ట్ పోన్ చేసుకోగా కొన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. కానీ కొన్ని దేశాలు కరోనా ని ఎదిరించి గెలిచాయి కూడా. న్యూజిలాండ్ లాంటి చిన్న దేశాలు ఈ ప్రభావం నుండి బయట పడ్డాయి. ఇక కొన్ని దేశాలు ప్రభావం తగ్గుతుండటం గమనించి…
కొత్త సినిమాలు కాకున్నా పాత సినిమాలతో థియేటర్స్ ని రీ ఓపెన్ చేయాలని డిసైడ్ అవ్వగా, రీసెంట్ గా దుబాయ్ లో సౌత్ అండ్ హిందీ మూవీస్ తో రీ ఓపెన్ చేశారు థియేటర్స్ ని, ఇక ఇప్పుడు ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల్లో కూడా థియేటర్స్ ని రీ ఓపెన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ముందుగా లాస్ట్ ఇయర్ సౌత్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ముందు నిలిచిన విజయ్ నటించిన బిగిల్ సినిమా తో మళ్ళీ థియేటర్స్ ని రీ ఓపెన్ చేస్తున్నారట. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 300 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని వసూల్ చేసిన ఈ సినిమా ను అక్కడ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట.
విజయ్ సినిమాలకు అక్కడ మంచి ఆదరణ ఉండగా కచ్చితంగా ఆడియన్స్ తిరిగి థియేటర్స్ కి వస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు థియేటర్ ఓనర్లు. ఇక ఇండియా లో మాత్రం థియేటర్స్ ఓపెన్ అవ్వడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. మరో రెండు మూడు నెలలు సమయం పట్టినా ఆశ్యర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు….