Home గాసిప్స్ 35 రోజులు అయిపొయింది…ఒక్కటి కూడా లేదు!!

35 రోజులు అయిపొయింది…ఒక్కటి కూడా లేదు!!

0

  2020 కొత్త ఇయర్ మొదలు అయ్యి మరి కొన్ని రోజుల్లో 2 నెలలు కూడా పూర్తీ కావస్తుంది, టాలీవుడ్ సంక్రాంతి సినిమాల హవా 6 వ వీకెండ్ లో కూడా కొనసాగుతుంది, ఇటు సరిలేరు నీకెవ్వరు అటు అల వైకుంఠ పురం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్నాయి. కానీ సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు.

సంక్రాంతి సీజన్ ముగిసి 35 రోజులు పూర్తీ అయింది, ఓవరాల్ గా ఇయర్ మొదలు అయ్యి 45 రోజులు కంప్లీట్ అయింది కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ కి దక్కిన హిట్లు మాత్రం కేవలం రెండే 2 సినిమాలు. అవి కూడా సంక్రాంతి బిగ్ మూవీస్ మాత్రమే.

అవి తప్పితే మిగిలిన సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ని మెప్పించ లేక పోయాయి. సంక్రాంతి సీజన్ ఎండ్ లో ఎంత మంచి వాడవురా, తర్వాత ‘అశ్వథ్థామ’ సినిమా, దానికన్నా ముందు రవితేజ డిస్కోరాజ సినిమా లు రిలీజ్ అయ్యి మొదటి నెలలో హిట్లు కాలేక పోయాయి. ఇక ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా…

Jaanu 2 Days Total Worldwide Collections!!

ఎలాంటి ప్రభావం చూపలేక పోతున్నాయి. జాను సినిమా మంచి రివ్యూ లు సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు. ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా నెగటివ్ టాక్ భారీ గా స్ప్రెడ్ అయ్యి రెండో రోజే స్లో డౌన్ అయింది.

ఇక ఇప్పుడు ఈ నెలలో నితిన్ నటించిన భీష్మ సినిమా మంచి అంచనాల నడుమ రానుండగా తర్వాత మంత్ ఎండ్ కి విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమా రిలీజ్ కానుంది. మరి ఇవి అయినా హిట్ అయ్యి సంక్రాంతి సినిమాలు అందించిన రికార్డ్ బ్రేకింగ్ ఆరంభాన్ని కంటిన్యు చేస్తాయో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here