బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన కాంతార సినిమా కన్నడలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇతర భాషల డబ్ రిలీజ్ అయ్యి హిందీ లో తెలుగు లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని చోట్లా లాంగ్ రన్ ని ఇంకా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
కాగా సినిమా రిలీజ్ అయిన నెల తర్వాతే సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా హిందీలో తెలుగు లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటంతో ఎలాగోలా OTT వాళ్ళతో మాట్లాడి సినిమా డిజిటల్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు…
375 కోట్ల మార్క్ ని దాటిన ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు అయిన 8 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ కి సినిమా సిద్ధం అవుతుంది. ఈ నెల 24న సినిమా డిజిటల్ రిలీజ్ ను ఆల్ మోస్ట్ అన్ని భాషల్లో ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మంచి ఫ్యాన్సీ…
రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి ప్రమోషన్స్ జరిపి 24న సినిమాను డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. అప్పటికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యే అవకాశం ఉండగా ఇక అప్పటి నుండి డిజిటల్ లో రచ్చ చేసే అవకాశం ఉంటుంది.