బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలను కంప్లీట్ చేసుకుని 6వ వారంలో ఎంటర్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి(Kalki 2898 AD Movie) ఇప్పటికీ షేర్స్ ని అందుకుంటూ దూసుకు పోతూ ఉండగా మరో పక్క రెండో వారంలో ఎంటర్ అయిన ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) మరోసారి మంచి జోరుని చూపిస్తుంది.
మొత్తం మీద కల్కి మూవీ 6వ వారంలో మేకర్స్ టికెట్ రేట్స్ ను తగ్గించడంతో ఆక్యుపెన్సీని అయితే గ్రోత్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా కల్కి మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ఉండగా మొత్తం మీద ఇప్పుడు 37వ రోజున తెలుగు రాష్ట్రాల్లో….
టికెట్ రేట్స్ ను తగ్గించడం ఆక్యుపెన్సీ పెరిగినా కూడా కలెక్షన్స్ కొంచం డే 36 రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా అటూ ఇటూగా సినిమా ఇప్పుడు 18-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో అలాగే మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపిస్తున్న సినిమా….
37వ రోజు వరల్డ్ వైడ్ గా 45-50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రెండో వారంలో అడుగు పెట్టిన రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్ అయినా అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
తమిళ్ లో మరోసారి జోరు చూపిస్తూ 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో సినిమా మంచి జోరుని చూపిస్తూ ఉండగా 8వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద రెండు సినిమాలు వేటి రేంజ్ లో అవి జోరు చూపిస్తూ ఉండగా ఓవరాల్ గా వీకెండ్ లో ఇక కొత్త సినిమాలు ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించడం లేదు కాబట్టి మరోసారి కల్కి జోరు చూపించే అవకాశం ఉంది. ఇక రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.