Home న్యూస్ 380 కోట్ల హీరో….ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుకున్నాడట…పాపం!

380 కోట్ల హీరో….ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుకున్నాడట…పాపం!

0

హీరోలు అన్నాక హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ కామన్ గా వస్తూనే ఉంటాయి, హీరోలు కెరీర్ లో ఎంచుకునే సినిమాలు వాటి రిజల్ట్ తోనే వాళ్ళ కెరీర్ ఎంత పీక్ కి వెళుతుంది అన్నది ఆధార పడి ఉంటుంది…. ఒక్క హిట్ తో కెరీర్ మొత్తం మారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్క ఫ్లాఫ్ తో కెరీర్ లో పూర్తిగా వెనక బడిన వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన హిట్స్ లేని హీరోల్లో షాహిద్ కపూర్ అందరి కన్నా ముందు ఉంటాడు, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి యంగ్ హీరోలు షాహిద్ కపూర్ కళ్ళ ముందు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి సూపర్ స్టార్ డంని సొంతం చేసుకున్నా కానీ…

షాహిద్ కపూర్ కి మాత్రం సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా పడక పోవడంతో తనతో సినిమాలు చేయడానికి కూడా ఏ పెద్ద డైరెక్టర్ ఉత్సాహం చూపలేదని, అలాంటి టైం లో కబీర్ సింగ్ తన లైఫ్ నే మార్చేసిందని రీసెంట్ గా జెర్సీ ట్రైలర్ లాంచ్ లో చెప్పుకొచ్చాడు షాహిద్… దాంతో మాటు మరిన్ని కామెంట్స్ చేశాడు షాహిద్…

‘కబీర్ సింగ్’ చేయడానికి ముందు తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని.. మిగతా హీరోల చిత్రాల్లా తన సినిమాలు భారీ వసూళ్లు సాధించడం లేదేంటని బాధ పడేవాడినని, 200-250 కోట్ల వసూళ్లు తెచ్చిన సినిమాలను రూపొందించిన దర్శకులు, నిర్మాతల దగ్గరికెళ్లి తనతోనూ అలాంటి సినిమాలు తీయాలని తాను అడుక్కుున్నట్లు షాహిద్ వెల్లడించడం విశేషం. ఐతే వాళ్లెవ్వరూ తనతో సినిమా తీయకపోయినా సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్’ మూవీతో తన కోరిక నెరవేర్చినట్లు చెప్పాడు.

ఆ ఒక్క సినిమా తన లైఫ్ నే మార్చగా ఇప్పుడు జెర్సీ సినిమా కూడా కబీర్ సింగ్ కి ఏమాత్రం తీసిపోని సినిమా అంటూ నమ్మకంగా ఉన్నాడు షాహిద్… కబీర్ సింగ్ సినిమా ఇండియాలో 278 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, ఓవర్సీస్ లో 48 కోట్లు… టోటల్ గా 380 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని ఇప్పుడు షాహిద్ కపూర్ కి తిరుగు లేని స్టార్ డమ్ ని తీసుకు వచ్చింది. ఇప్పుడు జెర్సీ కూడా ఇదే రేంజ్ హిట్ అయితే షాహిద్ క్రేజ్ మరో లెవల్ లో ఉండటం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here