Home న్యూస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు 3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

అంబాజీపేట మ్యారేజి బ్యాండు 3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

యంగ్ హీరో సుహాస్(Suhas)నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు(Ambajipeta Marriage Band Movie) మొదటి వీకెండ్ ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వాల్యూ బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది ఇప్పుడు. సినిమా 3వ రోజున సండే అడ్వాంటేజ్ ఉండగా…

ఉన్నంతలో మరోసారి మంచి జోరుని చూపించింది, నైజాంలో కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఆంధ్రలో సినిమా గ్రోత్ ని చూపించగా సీడెడ్ లో కూడా డీసెంట్ గా హోల్డ్ చేసింది. మొత్తం మీద 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయగా…

3 Days Ambajipeta marriage Band Movie Box Office Collections
మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లలో 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకోగా వాల్డ్ వైడ్ గా సినిమా 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 6.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ మార్క్ ని దాటేసిన సినిమా డీసెంట్ ప్రాఫిట్స్ ను దక్కించుకోబోతుంది. వర్కింగ్ డేస్ లో హోల్డ్ బాగుంటే లాంగ్ రన్ లో ఓవరాల్ గా మంచి లాభాలను సినిమా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here