Home గాసిప్స్ ప్రభాస్ కల్కి…ఎండింగ్ లీక్….ప్రకంపనలు ఖాయం అంటున్నారు!

ప్రభాస్ కల్కి…ఎండింగ్ లీక్….ప్రకంపనలు ఖాయం అంటున్నారు!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో రచ్చ చేసిన ప్రభాస్ ఆదిపురుష్(AdiPurush) మరియు సలార్(Salaar Movie) సినిమాలతో రచ్చ చేయగా ఇప్పుడు 2024 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు ప్రభాస్ నటించిన…

పాన్ వరల్డ్ మూవీ అంటున్న కల్కి 2898D( Kalki2898AD Movie) తో సమ్మర్ లో భారీ లెవల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. సినిమా మీద ఆల్ రెడీ సాలిడ్ అంచనాలు ఉండగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తి కరమైన వార్త ఇండస్ట్రీ లో హాల్ చల్ చేస్తుంది…

ఆ న్యూస్ ప్రకారం సినిమా క్లైమాక్స్ ఇండియన్ సినిమా హిస్టరీలో రాని కాన్సెప్ట్ తో వస్తుందట, కానీ ఆ క్లైమాక్స్ కొంచం హాలీవుడ్ లో వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో చూసినట్లు జనాలు అందరూ ఊహించని విధంగా చనిపోతారని, మానవ అవతారంలో ఉండే హీరో కూడా చనిపోతాడు అలాగే ఆ టైంలోనే..

కల్కి అవతారంలోకి వస్తాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి… ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సినిమా పార్ట్ 2 కోసం ఇలాంటి షాకింగ్ క్లైమాక్స్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు అయితే వస్తుంది. అదే కనుక నిజం అయితే మట్టుకు ఆడియన్స్ లో సినిమా మీద ఆసక్తి…

మరో లెవల్ లో పెరగడమే కాదు పార్ట్ 2 మీద అంచనాలు మరో లెవల్ లో పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది, కానీ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో అన్నది సినిమా నుండి వచ్చే కొత్త అప్ డేట్స్ తో తెలుస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here