Home న్యూస్ 350 కోట్ల సినిమా….3 రోజుల్లో రక్త కన్నీరు ఇది మాత్రం!

350 కోట్ల సినిమా….3 రోజుల్లో రక్త కన్నీరు ఇది మాత్రం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ మూవీస్ అంటే హైప్ సాలిడ్ గా ఉంటుంది…అంచనాలను అతీతంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ గా సొంతం అవుతాయి, ఇక తర్వత టాక్ బాగుంటే లాంగ్ రన్ మరో లెవల్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భారీ బడ్జెట్ సినిమాలు అన్ని సార్లు అంచనాలను అందుకోవాలని రూల్ ఏమి లేదు…

లేటెస్ట్ గా బాలీవుడ్ లో మోస్ట్ హైప్ ను క్రియేట్ చేసిన సినిమా అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వచ్చిన బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan Collections) సినిమా….రంజాన్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ ను పెట్టారు…

ఈ సినిమాతో అక్షయ్ కుమార్ రిమార్కబుల్ కంబ్యాక్ తో పాటు కెరీర్ లో మొదటి సారి 400 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు అంటూ హైప్ ను ఓ రేంజ్ లో పెంచారు…తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు నుండే అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ అత్యంత తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సాధిస్తుంది.

అతి కష్టం మీద 3 రోజుల్లో సినిమా ఇండియాలో 32 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమె అందుకుంది….వరల్డ్ వైడ్ గా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది. ఇండియాలో వర్త్ షేర్ పట్టుమని 16 కోట్లు కూడా రాలేదు…350 కోట్ల సినిమాకి ఫస్ట్ 3 రోజుల్లో వచ్చింది పట్టుమని 16 కోట్ల షేర్…

అంటే సినిమా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రక్త కన్నీరుని తలపిస్తూ నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు. వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోతుంది. మేకర్స్ టికెట్ కొంటె టికెట్ ఫ్రీ అంటూ ఆఫర్స్ ఇస్తున్నా కూడా జనాలు మాత్రం థియేటర్స్ కి రావడం లేదు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here