Home న్యూస్ ఛత్రపతి 3 డేస్ హిందీ కలెక్షన్స్….అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి!!

ఛత్రపతి 3 డేస్ హిందీ కలెక్షన్స్….అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి!!

0

తెలుగు రాష్ట్రాలలో సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ అయినా వస్తాయి కానీ హిందీలో తన సినిమాలకు సాలిడ్ వ్యూవర్ షిప్ రావడంతో ఛత్రపతి సినిమాతో అక్కడ అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కి సినిమా రిజల్ట్ ఇప్పుడు మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. మినిమమ్ కలెక్షన్స్ ని అయినా సినిమా అందుకుంటుంది అనుకుంటే…

మొదటి రోజు ఇండియాలో 50 లక్షల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రెండో రోజుకి వచ్చే సరికి కేవలం 30 లక్షల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుందని సమాచారం.

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద వీకెండ్ లో సినిమా ఇండియాలో 1.15 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని సాధించగా వర్త్ షేర్ మొత్తం మీద 45 లక్షల రేంజ్ లో ఉంటుందని సమాచారం. మొత్తం మీద ఈ సినిమా హిందీలో సాలిడ్ ఎంట్రీని సొంతం చేసుకోవాలి అనుకున్న…

బెల్లంకొండ శ్రీనివాస్ ఆశల పై నీళ్ళు పోసింది సినిమా రిజల్ట్… మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కూడా సినిమాను పెద్దగా పట్టించుకోకపోవడం విచారకరం అని చెప్పాలి. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here