Home న్యూస్ 159 కోట్ల హీరో…మళ్ళీ 50 కొట్టేశాడు…మాస్ ఫామ్ ఇది!!

159 కోట్ల హీరో…మళ్ళీ 50 కొట్టేశాడు…మాస్ ఫామ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో మళయాళ ఇండస్ట్రీ తిరుగులేని జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. లేటెస్ట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఆల్ రెడీ ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర  ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా…

ఆ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కొత్త సినిమా గురువయూర్ అంబాల నడియిల్( Guruvayoorambala Nadayil Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది, లైట్ కామెడీ ఎంటర్ టైనర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా….

వీకెండ్ లోనే దుమ్ము లేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేస్తూ ఇప్పుడు 50 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం…సినిమా కేరళలో మొత్తం మీద 21.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 4.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

ఓవరాల్ గా ఇండియాలో సినిమా 5 రోజుల్లో 26.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో సినిమా మరో లెవల్ లో జోరు చూపించగా 24.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో టోటల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి 50.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఓవరాల్ గా 159 కోట్ల బ్లాక్ బస్టర్ ఆడుజీవితం తర్వాత క్లాస్ మరో క్లాస్ మూవీ అయిన గురువయూర్ అంబాల నడియిల్ మరోసారి 50 కోట్ల మార్క్ ని అందుకోగా లాంగ్ రన్ లో సినిమా 80-85 కోట్ల రేంజ్ కి అవలీలగా వెళుతుంది అని అంటున్నారు…. వరుస బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపుతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి మరో బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవబోతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here