Home న్యూస్ సూపర్ హిట్ టాక్…కానీ వీకెండ్ లో వచ్చింది ఇదే!

సూపర్ హిట్ టాక్…కానీ వీకెండ్ లో వచ్చింది ఇదే!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీస్ కి ఒకప్పటిలా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. కోవిడ్ కి ముందు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న అక్షయ్ కుమార్ కోవిడ్ తర్వాత ఒక్క సూర్యవంశీ సినిమాతో మెప్పించగా…

మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు అక్షయ్ కుమార్ నటించిన OMG2 సినిమా రీసెంట్ గా మంచి విజయాన్నే సొంతం చేసుకుని అక్షయ్ కుమార్ కంబ్యాక్ మూవీగా….

నిలిచినా కూడా అక్షయ్ కుమార్ నటించిన కొత్త సినిమా మిషన్ రాణిగంజ్(Mission Raniganj) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఏమాత్రం బజ్ లేక పోవడంతో బుకింగ్స్ చాలా తక్కువగా ఉండగా సినిమాకి…

బాలీవుడ్ రివ్యూవర్ల నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా కలెక్షన్స్ పరంగా వీకెండ్ లో జోరు చూపిస్తుంది అనుకున్నా మొత్తం మీద మొదటి రోజు 2.8 కోట్లు, రెండో రోజు 4.80 కోట్లు అందుకోగా ఇక మూడో రోజు సాలిడ్ గ్రోత్ ని చూపిస్తుంది అనుకున్నా…

5 కోట్ల నెట్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. దాంతో 3 రోజుల వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12.60 కోట్ల నెట్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. ఒక బిగ్ స్టార్ మూవీకి ఇలాంటి ఓపెనింగ్స్ నిజంగానే మైండ్ బ్లాంక్ అనే చెప్పాలి. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here