Home న్యూస్ రూల్స్ రంజన్ వీకెండ్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ!

రూల్స్ రంజన్ వీకెండ్ కలెక్షన్స్….భారీ ఎదురుదెబ్బ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా మీద హీరో భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం…

అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ తో మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పాలి. సినిమా 2 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రలలో 70 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా…

85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా… మూడో రోజు కూడా పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోగా.. అందులో నుండి వర్త్ షేర్ 25 లక్షల లోపే ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా షేర్ ఏమి సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. దాంతో వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి లోపే షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.15 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇందులో కూడా కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి సినిమాకి ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా 4.5 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోబోతుండగా సినిమా ఆశలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరంకి తీవ్రంగా సినిమా నిరాశ పరిచింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here