Home గాసిప్స్ హాట్రిక్ ఎపిక్ డిసాస్టర్ లు…కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్!

హాట్రిక్ ఎపిక్ డిసాస్టర్ లు…కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్!

0

ఒక టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి మార్కెట్ ను సొంతం చేసుకుని తన కంటూ డీసెంట్ మార్కెట్ ను దక్కించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత కంప్లీట్ గా ఫామ్ కోల్పోయాడు….. బాక్ టు బాక్ వరుస పెట్టి 3 సినిమాలు రిలీజ్ అవ్వగా ఒక్కటి కూడా అంచనాలను అందుకోలేక పోయింది.

ఒకటి తర్వాత ఒకటి గని, గాండీవధారి అర్జున మరియు ఆపరేషన్ వాలెంటైన్ ఇలా మూడు భారీ డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకోగా ఇప్పుడు మట్కా అనే మరో డిఫెరెంట్ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాడు అన్నది ఆసక్తిగా మారగా ప్రస్తుతం కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లో ఉన్న….

వరుణ్ తేజ్ ఇప్పుడు తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో కొత్త సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉంది అనేది ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాంగ్ టాక్….వరుణ్ తేజ్ తో శేఖర్ కమ్ముల ఇది వరకు చేసిన ఫిదా సినిమా వరుణ్ తేజ్ కెరీర్ టర్నింగ్ మూవీ గా నిలిచింది…

ఆ సినిమా అంచనాలను మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర 47 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఆ సినిమా తర్వాత సోలో హీరోగా వరుణ్ తేజ్ మళ్ళీ అలాంటి విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు కెరీర్ లో మళ్ళీ అలాంటి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్…

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న కుబేర సినిమా తర్వాత తిరిగి వరుణ్ తేజ్ తో సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. అదే కనుక నిజం అయితే వరుణ్ తేజ్ కి సాలిడ్ కంబ్యాక్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here