Home న్యూస్ 3 నెలల నీరిక్షణ….హౌస్ ఫుల్ బోర్డులతో రెబల్ స్టార్ జాతర!

3 నెలల నీరిక్షణ….హౌస్ ఫుల్ బోర్డులతో రెబల్ స్టార్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ టాలీవుడ్ కి 2 భారీ హిట్స్ మినహా ఫస్టాఫ్ లో చాలా టైం చాలా అంటే చాలా చప్పగా సాగింది. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ఇయర్ ఫస్టాఫ్ రీసెంట్ టైంలోనే వీకేస్ట్ ఫస్టాఫ్ గా నిలుస్తుంది. అలాంటి ఫస్టాఫ్ కి ఎండ్ ని భారీ లెవల్ లో ఇవ్వడానికి ఇప్పుడు….

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మమ్మోత్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) వచ్చేసింది…ఆల్ రెడీ ప్రీ బుకింగ్స్ తోనే రికార్డులను క్రియేట్ చేసిన కల్కి మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపే రేంజ్ లో ఓపెన్ అయింది…

రీసెంట్ గా కొన్ని చిన్న సినిమాలు డీసెంట్ హౌస్ ఫుల్స్ ను సొంతం చేసుకున్నా సైతం ఇప్పుడు ఒక స్టార్ మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్ ఏ రేంజ్ లో వస్తారో ప్రభాస్ మరోసారి తన సత్తాని చూపిస్తూ అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీలతో దుమ్ము లేపుతూ హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపుతున్నాడు…

   

కొన్ని చోట్ల 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీలు ఉండగా ఓవరాల్ గా ఆల్ మోస్ట్ 3 నెలల భారీ గ్యాప్ తర్వాత చాలా వరకు థియేటర్స్ ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సైతం ప్రభాస్ కల్కి ఇప్పుడు సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించబోతుంది.

సినిమాకి రివ్యూలు కూడా ఇప్పుడు సూపర్ పాజిటివ్ గానే ఉండటంతో ఇప్పుడు ఆకాశమే హద్దుగా ప్రభాస్ కల్కి మూవీతో అన్ని చోట్లా సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. 3 నెలల తర్వాత మళ్ళీ మొదలైన ఈ హౌస్ ఫుల్స్ జాతర ఇయర్ మొత్తం మీద రిలీజ్ అయ్యే మేజర్ సినిమాలు అన్నీ ఇలానే కొనసాగించాలాని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here