Home న్యూస్ కల్కి2898AD రివ్యూ…..విజువల్ వండర్!!

కల్కి2898AD రివ్యూ…..విజువల్ వండర్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్(Nag Ashwin) ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie REVIEW-RATING) వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయింది. ట్రైలర్స్ తోనే విజువల్ వండర్ లా అనిపించిన కల్కి మూవీ ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే సుప్రీమ్ లీడర్ అయిన యాస్కిన్ అమ్మాయిలను తీసుకువచ్చి కృత్రిమ గర్బం దాల్చేలా చేసి వాళ్ళ నుండి సీరంని తీస్తూ ఉంటాడు…అక్కడ నుండి తప్పించుకున్న దీపికా పదుకునేని పట్టుకోవాలని చూడగా తన గర్బంలో ఉన్నది దైవం అని తెలిసి తను మహాభారతం టైంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వద్ధామ దీపికను కాపాడే భాద్యత తీసుకుంటాడు…

వీళ్ళకి బౌంటీ హంటర్ అయిన హీరోకి ఉన్న లింక్ ఏంటి….ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. కొన్ని కథలు వినేటప్పుడు బాగుంటాయి, కొన్ని కథలు చూసేటప్పుడు బాగుంటాయి…కల్కి మూవీ రెండో కోవకి చెందే కథ….కథగా చెప్పాలి అంటే సింపుల్ స్టోరీ పాయింటే అయినా కూడా మహాభారతంకి లింక్ చేస్తూ…

అల్లుకున్న ఈ కథకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా వరకు న్యాయం చేశాడు….కానీ ముందుగా నెగటివ్ పాయింట్స్ మాట్లాడుకోవాలి అంటే కథ టేక్ ఆఫ్ కి టైం తీసుకున్నాడు…ఫస్టాఫ్ లో అన్ని పాత్రల పరిచయాలకు వాడుకుని అసలు కథని ఇంటర్వెల్ ముందు నుండి మొదలు పెట్టాడు…ఇక కొన్ని చోట్ల లెంత్ ఎక్కువ అవ్వడం వలన సినిమా డ్రాగ్ అయిన ఫీలింగ్ కొన్ని చోట్ల కలిగింది….

లెంత్ కొంచం తగ్గించి, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం ఎక్కువ తీసుకోకుండా మరింత ఇంటెన్స్ ఉన్న సీన్స్ ని తీసి ఉంటే వంక పెట్టడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండేది…ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ నుండి సెకెండ్ ఆఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా గ్రాఫ్ అలా అలా లేస్తూ వెళుతూ ఉండగా…

క్లైమాక్స్ పోర్షన్ కి వచ్చే సరికి 25 నిమిషాల ఎపిసోడ్ చూపు తిప్పుకోనివ్వకుండా అప్పటి వరకు మనం చూసిన సినిమాను మరచి పోయి వేరే ట్రాన్స్ లోకి వెల్లిపోయేలా చేస్తుంది..ఆ ఎపిసోడ్ సినిమా రేంజ్ ని మరో లెవల్ కి వెళ్ళేలా చేసింది…నాగ్ అశ్విన్ ఆ ఎపిసోడ్ ను ఎక్స్ లెంట్ గా తీశాడు….

ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ప్రభాస్ మరోసారి దుమ్ము లేపాడు, ఫస్టాఫ్ లో కనిపించేది తక్కువే అయినా ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి సెకెండ్ ఆఫ్ మొత్తం తన రాంపెజ్ కనిపిస్తుంది. ఇక అమితాబ్ బచ్చన్ కి ఎక్స్ లెంట్ రోల్ పడగా అమితాబ్ ఆ రోల్ లో జీవించేశాడు…కమల్ హాసన్ లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా దీపిక కూడా బాగానే నటించగా….

మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉండగా వాళ్లతో పాటు స్పెషల్ క్యామియోలు కూడా ఉండగా అందరూ ఆకట్టుకున్నారు…సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా అనిపించింది…మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ దక్కి ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ కి వెళ్ళేది….సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా….

హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో ఆకట్టుకుంది కల్కి మూవీ….అక్కడక్కడా కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ పెట్టిన టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేసే సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి, ప్రభాస్ అమితాబ్ ల పోరాట సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ టికెట్ డబ్బులకు డబుల్ వర్త్ అని చెప్పాలి…

మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్…ఇలాంటి విజువల్ వండర్ మూవీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి….అందరు పడ్డ కష్టానికి ఈ రేటింగ్ కూడా సరిపోదు…రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో కల్కి మూవీ ఒకటిగా నిలుస్తుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ది బెస్ట్ మూవీ ఇదేనని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here