కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు అయితే కంప్లీట్ గా అంచనాలను అన్నీ మించి పోయి ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. సినిమా మొదటి రోజు వర్త్ షేర్ 6.98 కోట్ల దాకా ఉండగా…
రెండో రోజు వర్త్ షేర్ 7.79 కోట్లు సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక రెండు రోజుల ఊరమాస్ కలెక్షన్స్ తర్వాత ఇప్పుడు మూడో రోజులో ఎంటర్ అయిన బంగార్రాజు మార్నింగ్ మ్యాట్నీ షోల నుండే రాంపేజ్ చూపెట్టడం మొదలు పెట్టింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో…
రెండో రోజు తో పోల్చితే మూడో రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు 20-25% వరకు డ్రాప్స్ ను పలుచోట్ల సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉండటంతో మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా…
ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మూడో రోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి సాలిడ్ గ్రోత్ ని ఇలానే చూపెడితే 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ కి…
వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కానీ నైట్ షోల టైం కి చాలా మంది సిటీలకు తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి మరీ గ్రోత్ అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాలి, డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…