Home న్యూస్ 2nd డే కుమ్మేసిన రౌడీ బాయ్స్…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

2nd డే కుమ్మేసిన రౌడీ బాయ్స్…2 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వగా తొలిరోజు పోటి లో బంగార్రాజు ను అడ్డుకోలేక పోయింది ఈ సినిమా. అయినా కానీ డెబ్యూ హీరో మూవీ దృశ్యా మంచి కలెక్షన్స్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా అన్ని ఏరియాల….

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బయటికి చెప్పకూడదు అంటూ టీం అన్ని ఏరియాలలో చెప్పగా సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు బయట ఎక్కడా రివీల్ అవ్వడం లేదు అని చెప్పాలి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఫస్ట్ డే సినిమా తెలుగు రాష్ట్రాలలో 85 లక్షల షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 90 లక్షల దాకా ఉండగా రెండో రోజు సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో 40 లక్షలు, సీడెడ్ లో 16 లక్షలు, ఆంధ్రలో 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. టోటల్ గా 2వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

96 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా కోటి దాకా షేర్ ని అందుకుందని అంచనా వేస్తున్నారు. దాంతో 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని అంచనా… మొత్తం మీద మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించడం విశేషం అని చెప్పాలి కానీ…

సినిమా ఓవరాల్ బిజినెస్ వర్త్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా 11.5 కోట్ల దాకా టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 9.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీగా హోల్డ్ చేసి పరుగును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here