ఒక స్టార్ హీరో సినిమా మినిమమ్ 2.75 స్టార్ టు 3 స్టార్ రేటింగ్ తో పర్వాలేదు ఒక సారి చూడొచ్చు, సినిమా బాగుంది ఇలాంటి టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్లు కాకున్నా మంచి కలెక్షన్స్ తో మినిమమ్ జోరు చూపుతూ అయినా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పరిస్థితి మాత్రం ఊహకందని లెవల్ లో ఉందని చెప్పాలి.
బయట సినిమా పై జరుగుతున్న ప్రభావం కావచ్చు, ఆపోజిట్ పార్టీ లు సినిమాను బాయ్ కాట్ చేయడం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఏ కారణమో క్లియర్ గా తెలియ కున్నా కానీ తెలుగు వారి ఆరాధ్య నటుడు పొలిటికల్ లీడర్ అయిన స్వర్గీయ ఎన్టీఆర్.. గారి…
జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ ల పరిస్థితి మాత్రం చరిత్రకెక్కే విధంగా షాక్ ఇస్తుంది, సినిమా ఒక్క రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోతూ రోజు రోజు కి క్షీణిస్తూ చరిత్రకెక్కే డిసాస్టర్ గా మిగిలి పోనుంది.
సినిమా రెండు రోజులలో ఏకంగా 2.72 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోగా మూడో రోజు అయిన ఆదివారం అయినా పుంజుకుంటుంది అనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కేవలం 20 లక్షల నుండి 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో రోజు ని ముగించే దిశగా అడుగులు వేస్తూ షాక్ ఇస్తుంది.
దాంతో మొదటి పార్ట్ ని కూడా వెనక్కి నెట్టి ఇప్పుడు రెండో పార్ట్ చరిత్ర లో తొలి ప్లేస్ ని అధిగమించే విధంగా మూడో రోజు స్టార్ హీరోల సినిమాల్లో అత్యల్ప కలెక్షన్స్ ని మినిమమ్ 2.75 టు 3 స్టార్ రేటింగ్ తో సాధించే సినిమా గా మారబోతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.