బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ థియేటర్స్ ని హోల్డ్ చేసి మూడో వారంలో కూడా మాస్ కుమ్ముడు కుమ్మడానికి సిద్ధం అవుతుంది…
సినిమా రెండో వారంతో పోల్చితే మూడో వారంలో పోటి ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ హోల్డ్ ఎక్స్ లెంట్ గా ఉంది…సినిమా మూడో వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…నైజాంలో ఆల్ మోస్ట్ 200 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఓవరాల్ గా…
500 కి పైగానే థియేటర్స్ ని హోల్డ్ చేసింది ఇప్పుడు…దాంతో తెలుగు రాష్ట్రాలలోనే సినిమా ఏకంగా 700 కి పైగా థియేటర్స్ లో మూడో వీక్ ని కొనసాగిస్తుంది…ఇక తమిళ్ లో సినిమా మూడో వీక్ లో 100 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా కర్ణాటకలో కూడా 100 వరకు థియేటర్స్ లో రన్ అవుతున్నది…
కేరళలో స్క్రీన్ కౌంట్ మరింతగా తగ్గగా హిందీలో మాత్రం రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా 2800 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. దాంతో ఇండియాలోనే సినిమా మూడో వీక్ లో ఓవరాల్ గా 3700 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా…
ఓవర్సీస్ లో 1000 వరకు థియేటర్స్ లో సినిమా రన్ కొనసాగుతూ ఉండటంతో టోటల్ గా మూడో వీక్ లో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు సుమారు 4700 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. సినిమా మరోసారి మేజర్ కలెక్షన్స్ హిందీ నుండే రాబోతూ ఉండగా మిగిలిన చోట్ల సినిమాకి పోటిగా ఆయా భాషాల్లో సినిమాలు ఉన్నాయి. ఇక మూడో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.