బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు వేటి రేంజ్ లో అవి జనాలను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉండగా మంచు విష్ణు నటించిన జిన్నా మాత్రం కంప్లీట్ గా డౌన్ అయిపొయింది, సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా మరోసారి 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక మిగిలిన సినిమాలలో…
సర్దార్ సినిమా మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అటూ ఇటూగా 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక ఓరి దేవుడా సినిమా కూడా ఈ రోజు మంచి హోల్డ్ నే చూపించగా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ హోల్డ్ సినిమా కి కలిసి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక ప్రిన్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు పెద్దగా ట్రెండ్ ని చూపించడం లేదు, అటూ ఇటూగా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా కాంతార సినిమా 9వ రోజు ఇప్పుడు మరోసారి 80 నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది… ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.