Home న్యూస్ 3rd డే ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్…..బానే కుమ్ముతుంది సినిమా!!

3rd డే ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్…..బానే కుమ్ముతుంది సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరునే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు చూపించగా….

మూడో రోజు మరోసారి సండే అడ్వాంటేజ్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ డే 2 రేంజ్ లో సిమిలర్ గా ట్రెండ్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ బాగుండటంతో ఓవరాల్ గా మూడో రోజు మంచి కలెక్షన్స్ నే సాధిస్తుంది…

నైజాంలో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆంధ్ర అండ్ సీడెడ్ ఏరియాలలో మంచి జోరునే చూపిస్తుంది. మొత్తం మీద సినిమా మూడో రోజు ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఉన్నంతలో వీకెండ్ లో మంచి జోరునే సినిమా చూపించింది. ఇక టోటల్ గా వీకెండ్ లో అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here