బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా….రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ జోరు ని చూపించగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద లాభాలను కూడా సొంతం చేసుకోవడం మొదలు పెట్టిన సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు లాభాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టగా….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో అన్ని చోట్లా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు డే 2 కి ఏమాత్రం తీసిపోని ట్రెండ్ ను…
చూపెడుతూ మాస్ రచ్చ చేసింది….కానీ ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఉన్న నేపధ్యంలో బుకింగ్స్ లో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 2.8-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో డ్రాప్స్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పోతే మాత్రం సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఓవరాల్ గా అన్ సీజన్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ డబ్బింగ్ మూవీ అనుకున్న రేంజ్ కి మించి రచ్చ చేస్తూ ఇప్పుడు లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.