Home న్యూస్ 3rd డే కోర్ట్ మూవీ ఓపెనింగ్స్….ఈ రోజు మాస్ ఊచకోత ఖాయం!

3rd డే కోర్ట్ మూవీ ఓపెనింగ్స్….ఈ రోజు మాస్ ఊచకోత ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఈ వీకెండ్ లో ఊహించని విన్నర్ గా నిలవడమే కాదు కలెక్షన్స్ పరంగా ఆల్ మోస్ట్…

మీడియం రేంజ్ మూవీస్ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ దుమ్ము లేపుతుంది. సినిమా రెండు రోజుల్లో 15 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపెడుతూ..

దూసుకు పోతున్న సినిమా 3వ రోజున ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు సినిమా కి మరింతగా షోలు ఇప్పుడు పెరగగా ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…

డే 2 కన్నా కూడా బెటర్ గా ఓపెన్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ కూడా సాలిడ్ గానే ఉండటంతో మరోసారి అవలీలగా 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ డాలర్స్ ను దాటేసిన సినిమా లాంగ్ రన్ లో 1 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఓవరాల్ గా మూడో రోజు…

సినిమా కలెక్షన్స్ పరంగా అనుకున్న అంచనాలను మించి పోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేయడంతో సినిమా కి ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి. ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here