Home న్యూస్ 3rd డే జాక్ మూవీ కలెక్షన్స్…ఎట్టకేలకు గ్రోత్….కానీ!!

3rd డే జాక్ మూవీ కలెక్షన్స్…ఎట్టకేలకు గ్రోత్….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) సినిమా తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అనుకున్నా కూడా మొదటి షో కే సినిమా…

ఆడియన్స్ నుండి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఓవర్సీస్ లో అయినా కొంచం పర్వాలేదు అనిపించినా తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోయింది ఇప్పుడు..

రెండో రోజు వర్కింగ్ డే లో డ్రాప్ అయిన సినిమా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో కొంచం గ్రోత్ ని అయితే ఎట్టకేలకు చూపించింది కానీ అది సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా మూడో రోజున..

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మీద 15-20% రేంజ్ లో గ్రోత్ ని చూపిస్తూ ఉండగా మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మూడో రోజున ఇక్కడ 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే..

షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా కొద్ది వరకు హోల్డ్ ని చూపించడంతో మూడో రోజు వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఈ అంచనాలను..

ఎంతవరకు మించి ఇంకా షేర్ ని ఏమైనా పెంచుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here