మొదటి 2 రోజుల్లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) ….ముఖ్యంగా రెండో రోజు సినిమా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా….
కొన్ని చోట్ల డే 1 రేంజ్ లో కొన్ని చోట్ల డే 2 రేంజ్ లో జోరు చూపిస్తూ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా నైట్ షోలకు మాత్రం ఈ రోజు ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వలన ఇబ్బంది అయితే ఎదురు అయ్యే అవకాశం ఉండగా నైజాంలో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ కూడా ఉండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు మూడో రోజున…
తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే డే 1 రేంజ్ లో జోరు చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు 1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక మొదటి 2 రోజుల మాదిరిగా సినిమా అంచనాలను మించి పొతే మూడో రోజు 1.5 కోట్ల నుండి ఆ పైన షేర్ ని అందుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని దాటే అవకాశం ఉండగా మొత్తం మీద మూడో రోజుని సినిమా ఇప్పుడు మరోసారి మంచి హోల్డ్ తో కంప్లీట్ చేసుకోబోతుంది.
ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే విధంగా లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగించినట్లైతే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇక సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.