Home న్యూస్ 3rd DAY రావణాసుర కలెక్షన్స్….ఇవి సరిపోవు సామి!!

3rd DAY రావణాసుర కలెక్షన్స్….ఇవి సరిపోవు సామి!!

1

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా మూడో రోజులో ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి డీసెంట్ హోల్డ్ ని టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే చాలా సెంటర్స్ లో హోల్డ్ చేయగా…

నైట్ షోలకు నైజాంలో డ్రాప్స్ ఉండగా ఈ రోజు కూడా క్రికెట్ మ్యాచుల వలన కొంచం ఇంపాక్ట్ పడింది. సినిమా ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడంతో అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకే సినిమా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. ఇతర సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బెటర్ ఆప్షన్స్ ని వెతుకుతున్నారు..

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3వ రోజు మంచి హోల్డ్ ని చూపించింది అని చెప్పాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజుతో పోల్చితే 15% రేంజ్ లో డ్రాప్స్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో కనిపిస్తూ ఉండటంతో…

అటూ ఇటూగా ఈ రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.3 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ ఉండొచ్చు కానీ బ్రేక్ ఈవెన్ కి ఇవి సరిపోవు అనే చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here