Home న్యూస్ 3rd డే రావణాసుర ఓపెనింగ్స్….ఏంటి సామి ఇదీ!!

3rd డే రావణాసుర ఓపెనింగ్స్….ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా రెండో రోజు అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, మొదటి రోజు టాక్ కి రెండో రోజు డీసెంట్ హోల్డ్ అయినా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా సినిమా హోల్డ్ చేసి ఉండాల్సింది అని చెప్పాలి.

ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజుతో పోల్చితే 10-15% రేంజ్ లో డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని చెప్పాలి. నైజాంలో డే ఎండ్ టైంకి నైట్ షోలకు ఎలాగూ కొంచం డ్రాప్స్ ఉంటాయి… ఇక క్రికెట్ మ్యాచులు కూడా…

సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపుతున్నాయి. దాంతో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అటూ ఇటూగా 1.85 కోట్ల నుండి 2 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం…

అటూ ఇటూగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ హోల్డ్ సరిపోదు అనే చెప్పాలి. సినిమా మినిమమ్ ఈ రోజు 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇక డే ఎండ్ టైం కి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here