పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ (AdiPurush) ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టింది. సినిమా కనుక పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని ఉంటే…
ఈ పాటికే ఊరమాస్ వసూళ్ళని అందుకుని ఉండేది కానీ సినిమా కి విపరీతమైన ట్రోల్స్ ని సొంతం చేసుకోవడం అనేక విమర్శలను దక్కించుకోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్స్ తప్పితే మొత్తం మీద మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి.
ఇక సినిమా వారం వారం హోల్డ్ కంప్లీట్ గా తగ్గిపోవడంతో థియేటర్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. రెండో వారంలో 420 కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగించిన మూడో వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో 45 థియేటర్స్ లో టోటల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో 115 థియేటర్స్ లోనే పరుగును కొనసాగిస్తుంది… కానీ సినిమా ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ 50 కోట్లకు పైగా ఉండటంతో ఈ తక్కువ థియేటర్స్ లో ఇక సినిమా తేరుకునే అవకాశం లేదు. తెలుగు రాష్ట్రాలలోనే సినిమా మేజర్ గా కలెక్షన్స్ ని…
సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక సినిమా ఆ మొత్తాన్ని అందుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి. సినిమా ఇక మూడో వీకెండ్ లో ఎంతో కొంత కష్టపడి నష్టాన్ని ఇంకొంచం తగ్గించుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తుందో చూడాలి ఇప్పుడు.