Home న్యూస్ 3 సార్లు 3 ఏళ్ళు…..175 తో నట సింహం సింహ గర్జన!!

3 సార్లు 3 ఏళ్ళు…..175 తో నట సింహం సింహ గర్జన!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము దుమారం లేపే ఫామ్ లో ఉన్నాడు… 2021 ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో లోవేస్ట్ ఫేజ్ నుండి ఇప్పుడు కెరీర్ లోనే పీక్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు…

ఈ క్రమంలో బాక్స్ అఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్స్ లో ఎవ్వరూ అందుకోలేని రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు బాలయ్య, హాట్రిక్ విజయాలు, హాట్రిక్ 70 కోట్ల షేర్ మార్క్ రికార్డును సొంతం చేసుకోగా హాట్రిక్ 100 రోజులను కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు హాట్రిక్ 175 రోజులను సైతం అందుకుని మరో రికార్డ్ ను నమోదు చేశాడు…

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

ఈ 175 రోజులు అనే కాన్సెప్ట్ చాలా కాలంగా టాలీవుడ్ లో ఆగిపోయింది, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలను అలా థియేటర్స్ లో ఆడిస్తారు… ఇప్పుడు బాలయ్య పేరు మీద బాక్ టు బాక్ తన లాస్ట్ 3 సినిమాలు 175 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించాయి. అది కూడా బాక్ టు బాక్ రావడం, ఒక్కో ఏడాది ఒక్కో సినిమా ఇలా 175 రోజులను కంప్లీట్ చేసుకుంది.

ముందుగా అఖండ(Akhanda) 2022 లో 175 రోజులను కంప్లీట్ చేసుకోగా తర్వాత 2023 ఇయర్ లో వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) మూవీ 175 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు 2024 లో బాలయ్య భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా 175 రోజులను పూర్తి చేసుకుని దుమ్ము లేపింది…

రీసెంట్ టైంలో ఇలా 3 సార్లు 175 రోజులను కంప్లీట్ చేసుకున్న సినిమాల రికార్డ్, ప్రతీ ఏడాది ఒక్కో సినిమా ఈ రికార్డ్ ను అందుకోవడం ఇవన్నీ కూడా ఒక్క బాలయ్యకే సొంతం అవ్వడం రేర్ రికార్డ్ అని చెప్పాలి. ఇక బాలయ్య బాబీతో చేస్తున్న తన కొత్త సినిమా తో ఏ రేంజ్ లో రచ్చ లేపుతాడో చూడాలి.

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here