బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ మూవీస్ కలెక్షన్స్ కోసం కష్టపడుతున్న టైం లో కొత్త కాన్సెప్ట్ మూవీస్ ని మరీ అద్బుతమైన టాక్ వస్తే తప్ప జనాలు ఆదరించే రోజులు కావివి, ఎప్పుడో కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన క్లాసిక్ డాన్స్ బేస్ మూవీస్ ఈ మధ్య అంతరించిపోయిన విషయం తెలిసిందే, అలాంటి టైం లో ఒక డిఫెరెంట్ అటెంప్ట్ గా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా నాట్యం అనే సినిమా…
ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ రెగ్యులర్ మూవీ గోర్స్ సినిమాను అసలు పట్టించుకొనే లేదు… బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ మూవీ అయిన మహా సముద్రం లాంటి సినిమాలనే జనాలు ఆదరించలేదు అలాంటిది సీరియస్ నోట్ తో సాగే నాట్యం లాంటి సినిమాలను చూడటానికి థియేటర్స్ కి భారీ సంఖ్యలో…
వస్తారు అనుకోవడం అతిశయోక్తి అవుతుంది, మొత్తం మీద సినిమా 180 వరకు థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా, టేకింగ్, విజువల్స్, డాన్స్ అద్బుతంగా ఉన్నా కోర్ కథ పాయింట్ ఆకట్టుకునేలా లేక పోవడం తో హీరోయిన్ కి పేరు వచ్చినా…
సినిమా కి రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి. దాంతో ఆ ఇంపాక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై పడి వీకెండ్ లో 10 లక్షల రేంజ్ లోనే షేర్ ని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక 4 వ రోజు అతి కష్టం మీద 2 లక్షల రేంజ్ షేర్ రాగా మొత్తం మీద 4 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 లక్షల షేర్ ని…
20 లక్షల లోపు గ్రాస్ ని అందుకుందని సమాచారం. అది కూడా నెగటివ్ షేర్ లు డెఫిసిట్ లు తీయకుండా చెప్పిన కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే ఇక మిగిలేది ఏమి ఉండదని చెప్పొచ్చు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిరాశ పరిచే రిజల్ట్ నే ఇప్పుడు సొంతం చేసుకోవడం కన్ఫాం అయ్యింది అని చెప్పాలి.