బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేయడం ఖాయం అని చెప్పాలి. అలాంటిది ఏకంగా 4 స్టార్ యావరేజ్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా అంటే ఇక కలెక్షన్స్ పరంగా సంచలన రికార్డులతో దుమ్ము దులిపేయడం ఖాయమని చెప్పొచ్చు. కానీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ 83 వరల్డ్ కప్ మూవీ…
ఊహకందని రివ్యూలు రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే వసూళ్ళని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు భారీ డిసాస్టర్ కాబోతుంది అంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విచారకరం అని చెప్పొచ్చు.
సినిమా కి రిలీజ్ కి ముందే మీడియాకి షోలు వేసి చూపించగా అందరూ సినిమా అద్బుతంగా ఉందీ అంటూ 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొంచం స్లోగా ఉన్నా కానీ సినిమా అప్పటి క్రికెట్ వరల్డ్ కప్ విషయాలు తెలియని మనకు ఓ నోస్టాలిజియా ఫీలింగ్ ని కలిగించిందని మంచి రేటింగ్ లు ఇచ్చారు.
దాంతో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం అనుకున్నారు అందరూ, కట్ చేస్తే సినిమా ఫస్ట్ డే 12 కోట్లు, రెండో రోజు 16 కోట్లు, మూడో రోజు 16.5 కోట్లు, నాలుగో రోజు 7 కోట్లు మాత్రమే వసూల్ చేసి టోటల్ గా 4 రోజుల్లో 51 కోట్లు మాత్రమే వసూల్ చేయగా ఇండియాలో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే…
మినిమమ్ 190 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సాధించాలి అంటున్నారు. ఆ లెక్కన మొదటి వీకెండ్ లోనే 100 కోట్ల రేంజ్ కి వెళితే తప్ప కలెక్షన్స్ టార్గెట్ ను అందుకోవడం కష్టం. కానీ సినిమా 4 రోజుల్లో 51 కోట్లతోనే సరిపెట్టుకోవడంతో ఇక సినిమా తేరుకోవడం కష్టమేనని, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా సినిమా నిలవనుందని అంటున్నారు ఇప్పుడు.