కొన్ని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు అంతంత మాత్రమే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే తర్వాత డిజిటల్ రిలీజ్ అయినప్పుడు మాత్రం రెస్పాన్స్ బాగుటుంది, రీసెంట్ టైం లో ఇలాంటివి చాలా సినిమాలకే జరుగుతూ ఉండగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ టైం లో కూడా ఒక సినిమా విషయం లో ఇదే జరిగింది. ఆ సినిమా ఎప్పుడో 4 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వగా ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసిన ఈ సినిమా…
తెలుగు తమిళ్ లో రూపొంది…ఆ సినిమానే సందీప్ కిషన్ నటించిన మాయవన్ తెలుగు లో ప్రాజెక్ట్ Z సినిమా… సైంటిఫిక్ క్రైం థ్రిల్లర్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీ ష్రాఫ్ లాంటి మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు.
అయినా కానీ థియేట్రికల్ రన్ లో ఇబ్బందులను ఎదురుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ళ తర్వాత డిజిటల్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ అయినా కానీ డిజిటల్ లో మంచి పేరు తెచ్చుకోవడం తో…
ఈ సినిమా డైరెక్టర్ రీసెంట్ గా సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా మాయవన్ రీ లోడెడ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు. స్వీయ డైరెక్షన్ లో అండ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి అంటూ అఫీషియల్ గానే కన్ఫాం చేశారు. ఇక సందీప్ కిషన్ పుట్టిన రోజు టైం లో…
కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ లో ఈ సినిమా కూడా ఒకటిగా చేరింది. అందరినీ ఆశ్యర్య పరిచిన విషయం బాక్స్ ఆఫీస్ దగ్గర మాయవన్ ఫ్లాఫ్ అయినప్పటికీ కూడా సీక్వెల్ ని అనౌన్స్ చేశారు అంటే సీక్వెల్ కథ పై నమ్మకంగా ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ సీక్వెల్ ఎంతవరకు ఫలించి మొదటి భాగం నష్టాలను కూడా రికవరీ చేస్తుందో చూడాలి.