Home గాసిప్స్ 1 కాదు 2 కాదు…3 డిసాస్టర్లు…అయినా డోంట్ కేర్…అఖండ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

1 కాదు 2 కాదు…3 డిసాస్టర్లు…అయినా డోంట్ కేర్…అఖండ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

2072
0

నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైం లో వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు, జై సింహా సినిమా హిట్ తర్వాత బాలయ్య ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని డిసాస్టర్ మూవీస్ గా నిలిచాయి. ఇక తర్వాత బాలయ్య కమర్షియల్ భాటలో చేసిన రూలర్ సినిమా కూడా భారీ డిసాస్టర్ గా నిలిచింది, ఇలాంటి టైం లో బాలయ్య…

తనకి సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమాను ఒప్పుకున్నాడు, ఇటు బోయపాటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైనోడు తర్వాత హిట్ అందుకోలేదు, అయినా కానీ బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ పవర్ వలన…

హాట్రిక్ మూవీ కి బజ్ భారీగా పెరిగి పోగా బడ్జెట్ కూడా ముందు తక్కువలో చేయాలి అనుకున్నా బడ్జెట్ కూడా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు బిగ్ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో చాలా రిచ్ గా రూపొందుతున్న సినిమాగా చెప్పుకుంటున్నారు. బాలయ్య కెరీర్ లో ఆల్ టైం…

హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఈ సినిమాను చెప్పుకుంటున్నారు. ఏకంగా 60 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అవుతుందని సమాచారం. ఈ రేంజ్ బడ్జెట్ లో రెమ్యునరేషన్స్ కి తక్కువే వెళ్ళినా కానీ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ హై క్వాలిటీ తో సినిమాను తీస్తున్నారని అలాగే సెట్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయని అంటున్నారు.

అందుకే ఈ రేంజ్ బడ్జెట్ లో సినిమా నిర్మాణం అవుతుందని అంటున్నారు. మే 28 న రిలీజ్ అవ్వాల్సిన సినిమా సెకెండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారని తెలుస్తుంది, మరి బాలయ్య బోయపాటి అఖండ సినిమా తో ఏ రేంజ్ లో హాట్రిక్ హిట్ ని సొంతం చేసుకుంటారో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here