బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో కన్నడలో తెరకెక్కిన కాంతార(Kantara Movie) మూవీ ఒకటి, కేవలం 15 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….
తెలుగులో కూడా 29 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా కి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్1(Kantara Chapter 1 Movie) మొదలు అయినప్పటి నుండి కూడా ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ కి రెస్పాన్స్ మరో లెవల్ లో రాగా…
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కి ఆల్ రెడీ బిజినెస్ పరంగా సాలిడ్ ఆఫర్ రాగా రేటుని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుంది ఇప్పుడు….మొదటి పార్ట్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళే ఇప్పుడు ఊహకందని రేటు ఇచ్చేసి అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు లేటెస్ట్ సమాచారం.
ఓవరాల్ గా ఈ ప్రీక్వెల్ మూవీకి అన్ని భాషలు కలిపి డిజిటల్ రైట్స్ కింద అక్షరాలా 125 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందని సమాచారం…కన్నడ నుండి ఈ రేంజ్ రేటుని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. మమ్మోత్ రేటుకి నాన్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న కాంతార ప్రీక్వెల్ మూవీ….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు రిలీజ్ అయినా కూడా రికార్డ్ కలెక్షన్స్ ని కన్నడలో, తెలుగు లో మరియు హిందీలో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.