ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా అన్ని చోట్లా చూపిస్తున్న రాంపెజ్ ఒకెత్తు అయితే బాలీవుడ్ మార్కెట్ లో సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూపిస్తున్న కలెక్షన్స్ రాంపెజ్ మరో ఎత్తు అనే చెప్పాలి…మొదటి రోజు నుండి అక్కడ రికార్డులు ఏమి మిగలకుండా ఊరమాస్ రాంపెజ్ ను…
చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా కూడా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు ఫస్ట్ వీక్ లో అనేక రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. సినిమా 6 రోజుల్లోనే హిందీలో…
అనేక బిగ్గెస్ట్ మూవీస్ లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు 7వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 400 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని బాలీవుడ్ హిస్టరీలో ఏ రికార్డ్ ముక్క మిగలకుండా ఊచకోత కోసింది..
మొదటి వారంలోనే అనేక రికార్డుల బెండు తీసిన ఈ సినిమా ఇప్పుడు రెండో వీక్ లో ఎలాంటి పోటి లేకుండా సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేస్తూ ఉండగా ఈ ఊపు ఇలానే కొనసాగితే రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి హిందీలో 500 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక లాంగ్ రన్ లో సినిమా అవలీలగా 650-700 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా ఇదే కనుక జరిగితే ఇప్పట్లో బాలీవుడ్ లో పుష్ప2 నమోదు చేసే రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం తక్కువే అని చెప్పాలి.