Home న్యూస్ RRR-565…KGF2-557…కల్కి 507…ఈ జానర్ తో ఇది మాస్ ఊచకోత!!

RRR-565…KGF2-557…కల్కి 507…ఈ జానర్ తో ఇది మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సక్సెస్ లు గా నిలిచిన సినిమాల్లో RRR మూవీ మరియు KGF Chaptar2 సినిమాలు ముందు నిలుస్తాయి..తక్కువ గ్యాప్ లోనే వచ్చిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయగా ఇప్పుడు ఈ సినిమాల కలెక్షన్స్ తో పోటి పడుతూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie)…

అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో రచ్చ చేస్తుండగా, ఇప్పుడు 4 రోజులు పూర్తి అయిన తర్వాత మిగిలిన పాన్ ఇండియా మూవీస్ కలెక్షన్స్ తో పోటి పడుతూ కల్కి మూవీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసింది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా రిలీజ్ అయిన RRR మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తి అయిన తర్వాత….

వరల్డ్ వైడ్ గా 317 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 565 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ 4 రోజులు పూర్తి అయిన తర్వాత టోటల్ గా 277.81 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా…

   

వరల్డ్ వైడ్ గా 557.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…..ఇక ఈ సినిమాల్లో కేజిఎఫ్2 కి 4 రోజుల వీకెండ్ కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు సేం ఇలానే 4 రోజుల వీకెండ్ కలిసి వచ్చిన కల్కి మూవీకి టోటల్ గా లాంగ్ 4 డేస్ వీకెండ్ పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 265.73 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 507.30 కోట్ల మార్క్ ని అందుకుంది….కేజిఎఫ్2 సినిమాకి హిందీ కలెక్షన్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ రీసెంట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ కి మంచి పోటిని ఇస్తున్న కల్కి ఇతర సినిమాలతో పోల్చితే సైన్స్ ఫిక్షన్ లాంటి ఎక్స్ పెరిమెంటల్ సబ్జెక్ట్ తో వచ్చినా కూడా ఊచకోత కోస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here