Home న్యూస్ UI మూవీ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊహించిందే జరిగిందిగా!

UI మూవీ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊహించిందే జరిగిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie), వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….ఇక సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా…

సినిమా కి వచ్చిన మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ క్లియర్ గా కనిపించగా డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది సినిమా…తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినప్పటికీ మిగిలిన చోట్ల డ్రాప్స్ కొంచం ఎక్కువగా సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున మొత్తం మీద సినిమా 45 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.. 

ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇక్కడ మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, ఇంకా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటకలో సినిమా 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక సినిమా మొత్తం మీద…

4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
UI Movie 4 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 22.40Cr
👉Telugu States – 3.00Cr
👉ROI – 0.55Cr
👉Overseas – 1.00Cr***approx.
Total WW collection – 26.95CR(13.20CR~ Share) Approx.
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజులలో సాధించిన కలెక్షన్స్ లెక్క.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మరో 22 కోట్ల లోపు షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రంల్ ఓ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here