Home న్యూస్ కబ్జా ట్రైలర్ రివ్యూ…మరో KGF లా ఉందే…..కానీ!!

కబ్జా ట్రైలర్ రివ్యూ…మరో KGF లా ఉందే…..కానీ!!

0

కన్నడ ఇండస్ట్రీ నుండి ఒకటి తర్వాత ఒకటి పాన్ ఇండియా మూవీస్ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. కేజిఎఫ్ అండ్ కాంతార సక్సెస్ ల తర్వాత కన్నడ ఇండస్ట్రీ పై ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఇక కేజిఎఫ్ సిరీస్ ని పోలినట్లే అనిపిస్తూ ఉపేంద్ర హీరోగా కిచ్చ సుదీప్ కీలక రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కబ్జా మంచి అంచనాలనే క్రియేట్ చేయగా సినిమా ఆడియన్స్ ముందుకు….

ఈ నెల 17న రిలీజ్ కానుండగా ట్రైలర్ చూసిన తర్వాత మరోసారి ప్రతీ సీన్ లో ఈ సినిమాకి కేజిఎఫ్ కి ఏమైనా లింక్ ఉందా, లేక కేజిఎఫ్ కి ఈ సినిమా ప్రీక్వెల్ సినిమానా అనిపించేలా సేం క్వాలిటీ, సేం బ్యాగ్రౌండ్ స్కోర్, సేం టేకింగ్ ఆల్ మోస్ట్ ఆ సినిమానే ప్రతీ సీన్ లో గుర్తు చేసింది…

కథ 1945 టైంలో ఒక ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉండగా ఓవరాల్ గా కథ నార్మల్ గానే అనిపిస్తుంది. ఒక హీరో 4-5 విలన్ లు, మదర్ సెంటిమెంట్ యాంగిల్ తో ఆల్ మోస్ట్ కేజిఎఫ్ నే పోలి ఉంది ఈ సినిమా మొత్తం, అదే సినిమా కి ఇప్పుడు ప్లస్ అండ్ అదే మైనస్ అని కూడా చెప్పాలి.

కేజిఎఫ్ తో ఈ సినిమా కూడా ఒక భాగం అనుకునే వాళ్ళు సినిమా చూస్తారు, అది సినిమాకి ప్లస్, కేజిఎఫ్ నే మళ్ళీ తీస్తున్నారు అనుకునే వాళ్ళకి ఇది మైనస్ అవుతుందని చెప్పాలి. అయినా కానీ క్వాలిటీ పరంగా, రిచ్ నెస్ పరంగా భారీగా ఉండటంతో కేజిఎఫ్ లానే మెప్పించే విధంగా ఉంటే కచ్చితంగా ఈ సినిమా కూడా అలరించే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here