కొత్త సినిమాలకే పెద్దగా ఆదరణ ఉండటం లేదు కానీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 2004 బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉంది. 2004 టైం లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా ప్రభాస్ కి బిగ్ టర్నింగ్ పాయింట్ లా నిలిచిన ఈ సినిమా….
రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా తొలిరోజు 15 లక్షలు, రెండో రోజు 12 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 11 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…..
38 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 4వ రోజు వర్కింగ్ డే లో 5 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 రోజుల్లో సినిమా 43 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…. రీ రిలీజ్ అది కూడా అన్ సీజన్ లో…
అయినా కానీ ఇలాంటి కలెక్షన్స్ రావడం కూడా పెద్ద విషయం అనే చెప్పాలి. సినిమా ఈ గురువారం వరకు ఇలానే రన్ ని కొనసాగించే అవకాశం ఉంది, మొత్తం మీద రీ రిలీజ్ లో సినిమాకి మంచి కలెక్షన్స్ దక్కాయి అని చెప్పాలి. దాంతో రీ రిలీజ్ లు కూడా ఇప్పుడు మంచి బిజినెస్ గా మారబోతుంది..