Home న్యూస్ టైర్ 2 హీరోల టాప్ 10 బిజినెస్ లు…విజయ్ దేవరకొండ ఊరమాస్ డామినేషన్!!

టైర్ 2 హీరోల టాప్ 10 బిజినెస్ లు…విజయ్ దేవరకొండ ఊరమాస్ డామినేషన్!!

1

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సినిమా సినిమాకి సాలిడ్ బిజినెస్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా రీసెంట్ టైంలో హిట్స్ పెద్దగా లేకున్నా కూడా ప్రతీ సినిమాకి కూడా సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుంటూ ఉన్న విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star Movie) తో రచ్చ చేయడానికి….

సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు…ఉన్నంతలో సినిమా కి బజ్ ఉన్నా మరీ ఎక్కువ బిజినెస్ చేయకుండా 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా ఓవరాల్ గా మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది సినిమా….

ఇక టాప్ ప్లేస్ లో అలాగే టాప్ 2 ప్లేసులలో కూడా విజయ్ దేవరకొండ నటించిన సినిమాలే ఉండగా ఓవరాల్ గా టాప్ 5 లో 3 సినిమాలతో విజయ్ దేవరకొండ ఊచకోత కోశాడు అనే చెప్పాలి. ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…

Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#Skanda – 46.20CR
👉#FamilyStar – 43CR*******
👉#Akhil – 42CR
👉#Thewarriorr – 38.10CR
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR
👉#JayaJanakiNayaka – 34CR~

మొత్తం మీద టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ లో 4 సినిమాలతో విజయ్ దేవరకొండ ఫుల్ డామినేషన్ ను చూపించగా టాప్ ప్లేస్ లో ఉన్న లైగర్ మూవీ బిజినెస్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం కూడా తక్కువే అని చెప్పాలి. కానీ ఈ లిస్టులో ఉన్న సినిమాల్లో ఒక్క దసరా మాత్రమె హిట్ గీతని దాటింది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here