Home న్యూస్ ఫ్యామిలీ స్టార్ డే 1 టార్గెట్ ఇదే…..కొడుతుందా…..లేదా!!!

ఫ్యామిలీ స్టార్ డే 1 టార్గెట్ ఇదే…..కొడుతుందా…..లేదా!!!

0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా ప్రతీ సినిమా బిజినెస్ పరంగా కుమ్మేస్తూ వస్తున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఓపెనింగ్స్ పరంగా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో రచ్చ లేపుతూ ఉండగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి లాంటి క్లాస్ మూవీ తో కూడా ఆల్ మోస్ట్…

10 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపాడు.. కానీ ప్రస్తుతానికి హిట్స్ కి కొంచం దూరంగా ఉన్న విజయ్ దేవరకొండ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా మరో పక్క టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో బాక్స్ ఆఫీస్ దగ్గర….

మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న రికార్డ్ నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన దసరా(Dasara Movie) పేరిట ఉంది. ఆ సినిమా మొదటి రోజు 14.22 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుని బిగ్గెస్ట్ టైర్ 2 మూవీస్ డే 1 రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఇప్పుడు ఈ రికార్డ్ కలెక్షన్స్ నే….

బ్రేక్ చేసే టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతుంది విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star Movie)….సమ్మర్ లో ప్రస్తుతానికి బిగ్ బడ్జెట్ మూవీ ఇదే అవ్వడం, పోటి కూడా పెద్దగా లేక పోవడంతో దసరా డే 1 కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తి గా మారగా…..

ఇనీషియల్ బుకింగ్స్ మాత్రం కొంచం వీక్ గానే ఉన్నా కూడా సోలో బిగ్ రిలీజ్ అండ్ పాజిటివ్ టాక్ ను కనుక సినిమా సొంతం చేసుకుంటే దసరా డే 1 ను టార్గెట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here