కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా ఊరమాస్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ అల్టిమేట్ వసూళ్లు సాధించగా ఆదివారం రోజున మిగిలిన 2 రోజుల రేంజ్ లో మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయినా కానీ సినిమా…
సాలిడ్ గానే దుమ్ము లేపగా ఇప్పుడు 4వ రోజులో ఎంటర్ అయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి సాలిడ్ హోల్డ్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు తో పోల్చితే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 35% నుండి…
కొన్ని చోట్ల 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం బాగా ఉండటంతో మరోసారి రోజును సాలిడ్ గా కొనసాగించే అవకాశం ఉందని చెప్పాలి. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో పార్షిక హాలిడే నే అని చెప్పాలి. దాంతో ఆంధ్ర రీజన్ లో సినిమా…
మ్యాట్నీ షోలనుండి మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉండగా సీడెడ్ లో కూడా బెటర్ గా హోల్డ్ చేసింది, నైజాంలో మాత్రం కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రేంజ్ నుండి 3.8 కోట్ల దాకా షేర్ ని మినిమమ్ వసూల్ చేసే…
అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 4 కోట్ల కి పైగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇది సాలిడ్ హోల్డ్ అని చెప్పాలి కానీ నైజాంలో మట్టుకు డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉండటంతో రోజును ఎలా ముగిస్తుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి. రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.