బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూడు రోజుల్లో ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా, వర్కింగ్ డే లో ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా…
వర్కింగ్ డే లో సండే తో పోల్చితే ఆల్ మోస్ట్ 70-75% రేంజ్ లో టికెట్ సేల్స్ పరంగా డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా డ్రాప్స్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల పరంగా కొంచం గ్రోత్ కనిపించింది.
ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి మొత్తం మీద…4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.5 కోట్ల దాకా వెళ్ళొచ్చు కానీ సినిమా బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి సినిమా 6.5-7 కోట్ల దాకా వెళితే..
ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు…ఇక సినిమా హిందీలో ఈ రోజు 4.5-5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో డ్రాప్స్ ఉండగా తమిళ్ అండ్ కేరళలో కూడా డ్రాప్స్ ఉన్నాయి.
ఓవర్సీస్ లో సైతం సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత డ్రాప్స్ ఎక్కువగానే సొంతం చేసుకుంది…దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 4వ రోజు వరల్డ్ వైడ్ గా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ నే అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో తెలుగులో..
నైట్ షోల ట్రెండ్ బాగుండి ఈ అంచనాలను మించి పోయి 12 కోట్ల దాకా కనుక వెళితే సినిమా ఎక్స్ లెంట్ గా వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. మరి సినిమా ఈ అంచనాలను అందుకుంటో లేదో, 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.